ఒకో సారి మనకు ఎనిమిది కళ్ళు ఉన్నాయనిపిస్తోంది. నాకు అంతా కనిపిస్తుందని భ్రమ పడతాము. ఎనిమిది కళ్ళు ఉన్నా మనకు కనబడనివి చాలా ఉంటాయి, వీరాధివీరుడైన అర్జునుడి మనసులో ఏముందో ఎనిమిది కళ్ళు ఉన్న అష్ఠనేత్రాస్త్రం చూడలేకపోయింది.
ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను.
వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు ఈ నోట్స్ పూర్తిగా చదవండి. వ్యాపారం ఎందుకు మొదలు పెడుతున్నారు అని అడిగితే, ఎక్కువ శాతం ఈ 5 కారణాలు చెప్తారు. ఒకరి కింద పని చేయటం ఇష్టం లేదు, సొంతగా ఏదైనా చేయాలని ఉంది. నా Talent ను ఉపయోగించుకుని నా బాస్ లక్షలు, కోట్లు సంపాదించుకుంటున్నాడు, అదేదో నేనే వ్యాపారం పెడితే ఆ డబ్బు నేనే సంపాదించవచ్చు కదా. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదు. బ్రతకడానికి డబ్బు కావాలి. బ్రతుకు తెరువు కోసం వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. బిల్ గేట్స్ లాంటి గొప్పవాళ్లను చూసి inspire అయ్యాను, కోట్లు సంపాదించాలని ఉంది, మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. చదువు అబ్బలేదు, ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఒకరి కింద పని చేయటం ఇష్టం లేదు, వత్తిడి తట్టుకోలేకపోతున్నాను. సొంతగా ఏదైనా చేయాలనుకుంటున్నాను. వ్యాపారం మొదలు పెట్టిన తరువాత ఒకరు కాదు వంద మంది క్రింద పనిచేయాలి. రూపాయి పెట్టి ఒక వస్తువు కొన్న ప్రతీ ఒక్కరూ మీ బాస్ లాగే ప్రవర్తిస్తారు. ఉద్యోగి బాస్ దగ్గర మాత్రమే తిట్లు తింటాడు. వ్యాపారం మొదలు పెట్టిన తరువాత సరిగ్గా సర్వీస్ సరిగ్గా చేయకపోయినా, కొద్దిగా విసుగు ప్రదర్శించినా, ఆ కస్టమర్ మీ గురించి వందల మందికి దుష్ప్రచారం చేస్తాడు. అతను తిట్టడం మాత్రమే కాకుండా వందల మంది చేత తిట్టిస్తాడు. ఒకరి క్రింద పనిచేయటం ఇష్టం లేదు […]
READ MORE - పూర్తి పోస్టు చదవండికొన్ని సందర్భాలలో మన శత్రువులు లేదా మనకు ఎంతో నష్టం చేసిన వ్యక్తులు ఏడ్చినా మన హృదయం ద్రవించి పోతుంది. అలంటి సమయంలో మన పరిస్థితిని తప్పుగా అర్ధం చేసుకుని – నాది వెన్న పూస లాంటి మనసు అని అంటూ ఉంటాము. నిజానికి ఎవరికీ మనసు అనేది ఉండదు. మన శరీరంలో గుండె ఉంటుంది, మనసు కాదు. కవులు సృష్టించిన అబద్దం మనసు. ఇది మీకు వినటానికి చాలా కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. ప్రతి మనిషి శరీరంలో కొన్ని default settings ఉంటాయి. అంటే ఆటోమేటిక్ గా కొన్ని పనులు చేయించే mechanism అన్నమాట. వేడి నీళ్లు చేతి మీద పడిన వెంటనే మనం ఆలోచించకుండా చేయి తీసివేస్తాం. దూరం నుంచి వేగంగా ఏదైనా వాహనం వస్తుందట ఆలోచించకుండా తప్పుకుంటాం. వేరొకరు ఏడిస్తే మనకు కూడా ఏడుపు వస్తుంది ఇవన్నీ మనల్ని కాపాడటానికి ప్రకృతి మనలోపల పెట్టిన బుల్లి softwares. ప్రమాద సమయాల్లో ఆలోచించే సమయం కూడా మనకు ఉండదు, అలాంటప్పుడు ఈ లోపల ఉన్న బుల్లి softwares మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండానే మనల్ని కాపాడేస్తాయి. మీరు రోడ్డు మీద వేగంగా వెళ్తున్నపుడు అనుకోకుండా మీ బైకు స్కిడ్ అయ్యింది. ఎలా చేస్తున్నారో కూడా తెలియకుండా మీరు కొన్ని తెలివైన పనులు చేస్తారు. ఆ తరువాత ఆ accident నుంచి మీరు ఎంత తెలివిగా తప్పుంచుకున్నారు అని […]
READ MORE - పూర్తి పోస్టు చదవండిఅమ్మాయిలకు డబ్బు పిచ్చి పట్టింది అనే వాదన ఈ మధ్య బాగా వినిపిస్తుంది. నిజానికి అమ్మాయిలు డబ్బు, కెపాసిటీ, పవర్ కోరుకోవటం కొత్త విషయం కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఆడ జీవి ఇలాగే ప్రవర్తిస్తుంది. ప్రతి ఆడ జంతువు కేవలం సామర్థ్యం ఉన్న మగజంతువుతో మాత్రమే mating చేసి పిల్లల్ని కంటుంది. అమ్మాయిలు ఇలా చేయటానికి కారణం ఈ సృష్టిని నడిపించే mechanism అయిన ప్రకృతి అమ్మాయిలకు ఒక పని అప్పజెప్పింది. అబ్బాయిలలో సమర్థులని బ్రతికించు, అసమర్థులు చంపేయమని. బ్రతికించటం అంటే వారి సంతతిని భూమి మీద ఉండేలా చేయటం. చంపేయటం అంటే వారి సంతతి లేకుండా చేయటం. మన సంతానం భూమి మీద ఉంది అంటే మనం ఏదోలాగా బ్రతికున్నట్టు. మన సంతానం భూమి మీద లేదు అంటే మనం చచ్చి పోయినట్టు. అమ్మాయిలు అందుకే అబ్బాయిల విషయంలో చాలా చాలా unreasonable గా ఉంటారు. వాళ్ళు అందంగా లేకపోయినా అందమైన అబ్బాయి, కావాలంటారు, డబ్బు ఉండాలి అంటారు, చాలా caring గా చూసుకోవాలి అంటారు. వాళ్ళ లిస్ట్ చాలా పెద్దది. ఇవన్నీ అమ్మాయిల కోరికలు కాదు, nature వాళ్లకు ఇచ్చిన ఆదేశాలు. అవి అమ్మాయిల మనసులో feelings లాగా ఎంటర్ అవుతాయి. ఆ ఫీలింగ్స్ ఏమి చెప్తే అలా చేసేస్తారు అమ్మాయిలు. వాటి వెనుక ఉన్న లాజికల్ స్టెప్స్ అడిగితే వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. ఒక […]
READ MORE - పూర్తి పోస్టు చదవండి