అమ్మాయిలకు డబ్బు పిచ్చి పట్టింది అనే వాదన ఈ మధ్య బాగా వినిపిస్తుంది. నిజానికి అమ్మాయిలు డబ్బు, కెపాసిటీ, పవర్ కోరుకోవటం కొత్త విషయం కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఆడ జీవి ఇలాగే ప్రవర్తిస్తుంది. ప్రతి ఆడ జంతువు కేవలం సామర్థ్యం ఉన్న మగజంతువుతో మాత్రమే mating చేసి పిల్లల్ని కంటుంది.

అమ్మాయిలు ఇలా చేయటానికి కారణం ఈ సృష్టిని నడిపించే mechanism అయిన ప్రకృతి అమ్మాయిలకు ఒక పని అప్పజెప్పింది. అబ్బాయిలలో సమర్థులని బ్రతికించు, అసమర్థులు చంపేయమని. 

బ్రతికించటం అంటే వారి సంతతిని భూమి మీద ఉండేలా చేయటం. చంపేయటం అంటే వారి సంతతి లేకుండా చేయటం. మన సంతానం భూమి మీద ఉంది అంటే మనం ఏదోలాగా బ్రతికున్నట్టు. మన సంతానం భూమి మీద లేదు అంటే మనం చచ్చి పోయినట్టు.

అమ్మాయిలు అందుకే అబ్బాయిల విషయంలో చాలా చాలా unreasonable గా ఉంటారు. వాళ్ళు అందంగా లేకపోయినా అందమైన అబ్బాయి, కావాలంటారు, డబ్బు ఉండాలి అంటారు, చాలా caring గా చూసుకోవాలి అంటారు. వాళ్ళ లిస్ట్ చాలా పెద్దది. ఇవన్నీ అమ్మాయిల కోరికలు కాదు, nature వాళ్లకు ఇచ్చిన ఆదేశాలు. అవి అమ్మాయిల మనసులో feelings లాగా ఎంటర్ అవుతాయి. ఆ ఫీలింగ్స్ ఏమి చెప్తే అలా చేసేస్తారు అమ్మాయిలు. వాటి వెనుక ఉన్న లాజికల్ స్టెప్స్ అడిగితే వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. 

ఒక అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయిలకు కావాల్సినవి రెండు విషయాలు 1. మంచి జీన్స్, 2. అతను సంపాదించే డబ్బు లేదా resources.

ప్రక్రుతికి మీరు మంచివారా లేదా చెడ్డ వారా అన్న సంగతి అనవసరం. మీరు ఎదో ఒక పని చేసి బ్రతికి బట్టగట్టగలుగుతున్నరా లేదా అన్నదే ముఖ్యం. చివరకు అది అబద్దలు చెప్పి జనలను మొసం చేసి అయినా సరే. అందుకే మంచి చెడు అనే అలొచన లెకుందా అమ్మాయిలు బ్రతకనేర్చిన వారివద్దకు వెల్తారు.

సామర్థ్యం లేని అబ్బాయిలు నిజాయితీ గల స్వచ్చమైన ప్రేమ అని ఒక అబద్దం సృష్టించారు. ఈ అబద్దం చెప్పి అమ్మాయిలను గిల్టీ గా ఫీల్ అయ్యేటట్టు చేసి పెళ్లి చేసుకుంటున్నారు.గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ అబద్దాన్ని సృష్టించటం కూడా సామర్ధ్యమే. ఈ మాటలు గారడీ కూడా ఒక జీవి survival కు ఉపయోగపడుతుంది.

మీరు గమనించారో లేదో ఎక్కువ డబ్బు, పవర్ ఉన్న అబ్బాయిలకు విపరీతంగా అమ్మాయిలనుంచి  నుంచి ఆఫర్స్ వస్తాయి. వారి జీన్స్ కుదిరినంత తొందరగా లాగేసుకోవాలి. అవి చాలా విలువైనవి కాబట్టి.

అది సంగతి !