మంచి అమ్మాయిలు ఎలా ఉంటారు?

అభద్రతా భావం వలన అబ్బాయిలను బద్దకస్తులని చేసే అమ్మాయిల గురించి పైన వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు మంచి అమ్మాయిల గురించి తెలుసుకుందాం. 

మంచి అమ్మాయిలు మనకు అంతగా నచ్చరు. వాళ్ళ ప్రేమ మీకు ఎలాంటి high ఇవ్వదు (మత్తెక్కినట్టు వుండదు) చాలా చప్పగా, రుచి పచిలేనట్టు ఉంటుంది, ఒక విధంగా చెప్పాలంటే బోరుకొడుతుంది.

మొదటినుంచి వాళ్ళ concept చాలా సింపుల్. మీరు వాళ్ళ మీద ఆధార పడకూడదు. అన్ని పనులలో మీకు సాయం చేయటానికి అందుబాటులో ఉంటారు తప్ప, మీరు బద్దకస్తులు అయ్యే స్థాయికి వాళ్ళు మీ పనులు చేసిపెట్టరు. అన్ని పనులు మీరు కూడా చేయాలనీ మొదటినుంచీ చాలా గట్టిగా చెప్పేస్తారు. అమ్మాయి దోశలు వేస్తే, మీ చేత ఉల్లిపాయలు, అల్లం తరిగిస్తుంది. అన్ని పనులలో షేరింగ్ compulsory! 

ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతూ, తన మీద మీరు పూర్తిగా ఆధార పడుతున్నట్టు కనిపిస్తే ఆ అమ్మాయి అనే మాటలు ఇలా ఉంటాయి.

నాకు రేపు ఏమైనా అయినా, మన పెళ్లి అవ్వకపోయినా నువ్వు పిచ్చివాడివి అయిపోతావ్. నాతో పాటు నీ లైఫ్ లో బోలెడు ఆనందాలు ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, ఫామిలీ ఉండాలి, నీ ప్రాజెక్ట్స్ కు టైమ్ ఇవ్వు, కెరీర్ మీద ఫోకస్ చెయ్యి. 

ఈ మాటలు అనే అమ్మాయి మీకు దొరికితే సంకలో పెట్టుకుని పరిగెత్తండి, వదలద్దు!