మహాభారతం – అష్ఠనేత్రాస్త్రం – అనుబంధ వ్యాసం


ఒకో సారి మనకు ఎనిమిది కళ్ళు ఉన్నాయనిపిస్తోంది. నాకు అంతా కనిపిస్తుందని భ్రమ పడతాము. ఎనిమిది కళ్ళు ఉన్నా మనకు కనబడనివి చాలా ఉంటాయి, వీరాధివీరుడైన అర్జునుడి మనసులో ఏముందో ఎనిమిది కళ్ళు ఉన్న అష్ఠనేత్రాస్త్రం చూడలేకపోయింది. 

నిత్యాక్షుడికి కళ్ళు లేవు కాబట్టి అతనికి దారి చూపించాలి. అర్జునుడికి కళ్ళు ఉన్నాయి గురిపెట్టడడం తెలిసిన సమర్ధుడు, అతని వద్ద కళ్ళు మూసుకుని చెప్పిన దిక్కులో వెళ్ళాలి.  

ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. 

(గమనిక ఇది కల్పితమైన ఉదాహరణ మాత్రమే. నిజంగా జరగలేదు, గమనించగలరు)

బాహుబలి సినిమాలో ధీవరా పాటలో, అవంతిక కోసం ఒక కొండ మీద నుంచి ఇంకో కొండమీదకు దూకుతాడు శివుడు.

ఈ సీన్ రాజమౌళి సుబ్బారావ్ అనే ఒక స్పెషల్ అఫక్ట్స్ ఆర్టిస్ట్ కు చెప్పాడు. అతనికి ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉంది.  బయటకు అనకపోయినా అతని మనసులో రాజమౌళిని ఇలా తిట్టుకున్నాడు. 

“Common sense లేని వాడు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ఫిజిక్స్ రూల్స్ గురించి తెలియదు, కనీసం gravity అనే పదానికి అర్ధంకూడా తెలియని ఇలాంటోడు స్టార్ డైరెక్టర్ ఏంటి నా కర్మ కాకపోతే, నాలాగా అన్నీతెలిసినోడు లక్షరూపాయల జీతానికి గొడ్డు చాకిరి చేస్తుంటే, రాజమౌళి కోట్లు సంపాదిస్తున్నాడు. అదృష్టం లేకపోతే ఎన్ని తెలిసినా వృధానే” అని నిట్టూర్చాడు”

ఈ సుబ్బారావ్ ప్రతి ఆఫీసులో ఉంటాడు. బాస్ కంటే  తనకు ఎక్కువ తెలుసనని ఫీల్ అయ్యి, తన మీద తనే జాలి పడుతుంటాడు.ఈ సుబ్బారావ్ అష్ఠనేత్రాస్త్రం లాంటివాడు, తనకు అన్నీకనిపిస్తున్నాయని అనుకుంటున్నాడు. కానీ అతనికి అర్జునుడి మనసులో ఏముందో తెలియదు, చెప్పినా అర్ధం చేసుకునే maturity ఉండదు.

ఇప్పుడు అర్జునుడు(రాజమౌళి) మనసులో ఏముందో చూద్దాం.

రాజమౌళి పిచ్చోడు కాదు, లాజిక్ తెలియనివాడు అంతకన్నా కాదు. రాజమౌళికి న్యూటన్ ఫిజిక్స్ వల్ల సినిమాలకు కలెక్షన్స్ రావు అని తెలుసు. అందుకే రాజమౌళి ఫిజిక్స్ బుక్కులో ఉండే ఒకే ఒక్క సిద్ధాంతం IMPACT.

ప్రతి ఒక్క సీన్ ఆడియన్స్ మైండ్లో impact create చేయాలి. దానికోసం ఫిజిక్స్ రూల్స్ తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తాడు. ఇది తెలివైన వాడినని అనుకునేవాడికి నచ్చదు, రాజమౌళిని విమర్శించి లోలోపల కుళ్ళి కుళ్ళి చస్తాడు.

నిజమైన తెలివి మన అంటే మన తెలివినిపక్కన పెట్టిగలగటం. లక్ష తెలిసినా వాటిని అదిమిపెట్టి ఆడియన్స్ ఇష్టాయిష్టాలకు ట్యూన్ అవ్వటం. అలా ట్యూన్ అవ్వలేని ఎంతో మంది మొండివాళ్ళు డబ్బు సంపాదించలేక తెలివైన వాళ్ళ లాగా మిగిలిపోతారు. (పచ్చిగా చెప్పాలంటే సంకనాకిపోతారు)

మీ బాస్ సమర్థుడైతే అతనిని గుడ్డిగా follow అయ్యి, అతని చేతిలో ఒక ఆయుధంలాగా మారి దూసుకెళ్ళాలి. అంతే కానీ అటు ఇటు చూడకూడదు, బాస్ నిర్ణయాన్నిప్రశ్నించకూడదు. 

అది సంగతి! మీరు నన్ను ఏమైనా అడగాలి నాకు ఇమెయిల్ చేయండి – avinashvlog@gmail.com లేదంటే నా contact page ద్వారా నాకు డైరెక్ట్ గా సందేశం పంపవచ్చు.

[గమనిక – బాహుబలి సినిమా సమయంలో నేను పైన చెప్పిన విషయం జరగలేదు. ఇది కేవలం కల్పిత ఉదాహరణ మాత్రమే. మీకు అర్ధం అవ్వటానికి ఈ సినిమా ఉదాహరణ తీసుకోవటం జరిగింది. ఒకప్పుడు సినిమాల్లో నేను పనిచేశాను, పైన చెప్పిన ఉదాహరణ చాలా కామన్ గా జరిగేది. డైరెక్టర్ కంటే ఎక్కువ నాకు తెలుసు Crew లో ప్రతి ఒక్కడూ అనుకునేవాడు.]