Describe – వర్ణించటం, వివరించి చెప్పటం

ఆ వ్యక్తి చూడటానికి ఎలా ఉంటాడో కొంచం చెప్తారా?

ఆ వ్యక్తిని కొంచం describe చేస్తారా?

Blessed – దీవించబడ్డ, అదృష్టవంతుడయిన

Follow your heart – నీ మనసుకు నచ్చింది చెయ్యి

శ్రీనుగాడు చాలా చాలా అదృష్టవంతుడు. వాళ్ళ  parents ఎంతో స్వేచ్ఛ ఇస్తారు. దిశా నిర్దేశం  చేస్తారు గానీ ఆంక్షలు విధించరు. నీ మనసుకు నచ్చింది చెయ్యి అని ఎప్పుడూ అంటారు.

శ్రీనుగాడు చాలా Blessed రా. వాళ్ళ  parents ఎంతో freedom ఇస్తారు. Guidance ఇస్తారు, గానే రూల్స్ పెట్టరు. Follow your heart అని ఎప్పుడూ అంటారు.

Eccentric – అసాధారణమైన

రామ్ గోపాల్ వర్మ వింత వింత పనులు చేస్తుంటాడు, అదో రకం క్యారెక్టర్ అతనిది.

రామ్ గోపాల్ వర్మ వింత వింత పనులు చేస్తుంటాడు, అతనిది ఒక eccentric character

Optimism – ఆశావాదం

సుబ్బు ఆశావాది. ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నా, ప్రతి situation లో మంచి మాత్రమే చూస్తాడు. 

సుబ్బు చాలా optimistic, ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నా, ప్రతి situation లో మంచి మాత్రమే చూస్తాడు.

Generous – ఉదారమైన

రజనీకాంత చాలా ఉదారమైన స్వభావం ఉన్నవ్యక్తి అని విన్నాను

రజనీకాంత్ చాలా generous అని విన్నాను.

Potential – సామర్థ్యం

నీలో ఎంతో సామర్థ్యం ఉంది  అని నేను నమ్ముతున్నాను.

నీలో ఎంతో potential ఉంది అని నేను నమ్ముతున్నాను.

Straight forward – ముక్కుసూటిగా  |  Diplomatic – లౌక్యంగా

అన్నివేళలా ముక్కుసూటి ధోరణి పనికిరాదు, ఒక్కో సారి లౌక్యం అవసరం.

అన్నివేళలా straight forwardగా ఉంటే కష్టం, ఒక్కో సారి Diplomacy అవసరం.

Effortless – అవలీలగా

అతనికి ఈ పనిలో చాలా అనుభవం ఉంది, అవలీలగా చేయగలడు.

అతనికి ఈ పనిలో చాలా అనుభవం ఉంది, Effortlessగా చేయగలడు.

Tech savvy – టెక్నాలజీ గురించి బాగా తెలిసిన

కంప్యూటర్స్ గురించి నాకు ఏమీ తెలియదు, అదంతా మా చిన్నోడు చూసుకుంటాడు. వాడికి కంప్యూటర్స్/టెక్నాలజీ గురించి బాగా తెలుసు. 

కంప్యూటర్స్ గురించి నాకు ఏమీ తెలియదు, అదంతా మా చిన్నోడు చూసుకుంటాడు. వాడు చాలా tech savvy.

Overthink – అతిగా ఆలోచించటం

శృతి… నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావు. ఇది నీ ఎదుగుదలకు చాలా మంచి అవకాశం, భయపడకుండా ముందుకెళ్లు. అంతా మంచే జరుగుతుంది.

శృతి… నువ్వు overthink చేస్తున్నావ్, ఇది నీ growth కు ఒక మంచి opportunity. భయపడకుండా ముందుకెళ్లు. Everything will be alright.

Finally – మొత్తనికి, చివరకు

చాలా చాలా సంతోషంగా ఉందిరా! మొత్తనికి సాదించావు.

చాలా చాలా సంతోషంగా ఉందిరా! Finally. సాదించావు.

Obstacles – అడ్డంకులు – Overcome – అధిగమించటం

మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి, కానీ అతను అధిగమించాడు.

మధ్యలో ఎన్నో obstacles వచ్చాయి, కానీ అతను overcome చేశాడు.

Stubborn – మొండి  Compromise – రాజీ 

సుబ్బలక్ష్మి చాలా మొండిది. కొంచం కూడా రాజీపడదు.

సుబ్బలక్ష్మి చాలా  stubborn. కొంచంకూడా compromise అవ్వదు

Shy – సిగ్గు

విష్ణుకి కొంచం సిగ్గు, అందరితో వెంటనే కలవలేడు 

విష్ణు కొంచం shy,అందరితో వెంటనే కలవలేడు 

Smile – నవ్వు

షాలిని నవ్వు చాలా బావుంటుంది 

షాలిని smile చాలా బావుంటుంది 

Too much – మరీ ఎక్కువ

రాహుల్ మరీ ఎక్కువ చేస్తున్నాడు కదా 

రాహుల్ too much చేస్తున్నాడు కదా 

Disappoint – నిరాశ

ఈ రోజు మన వాళ్ళు బాగా నిరాశ పరిచారు (క్రికెట్ గురించి సంభాషణ)

ఈ రోజు మన వాళ్ళు బాగా disappoint చేశారు 

Shade – నీడ

ఎండలో నుంచున్నాము, అక్కడకు వెళ్లి నీడలో నుంచుందాం పదా 

ఎండలో నుంచున్నాము, అక్కడకు వెళ్లి shadeలో నుంచుందాం పదా 

Spicy – ఘాటు

బిర్యానీ బాగా ఘాటుగా ఉంది 

బిర్యానీ బాగా spicyగా ఉంది 

Stubborn – మొండి

అరవింద్ చాలా మొండి వాడు. ఎవరి మాటా వినడు 

అరవింద్ చాలా stubborn. ఎవరి మాటా వినడు. 

Tired – అలసిపోయిన

బాగా అలసిపోయినట్టున్నావ్, ముందు కూర్చో.

బాగా tired అయినట్టున్నావ్, ముందు కూర్చో.

Attempt – ప్రయత్నం

ఇంకోసారి ప్రయత్నం చేస్తే తప్పు ఏంటి? 

ఇంకోసారి attempt చేస్తే తప్పు ఏంటి? 

Definite – ఖచ్చితంగా

నువ్వు చేయగలవా? – ఖచ్చితంగా చేయగలను 

నువ్వు చేయగలవా? – definiteగా చేయగలను 

Belief – నమ్మకం

Believe – నమ్ముటం

న్యూస్ చానెల్స్ చెప్పేది మనం నమ్మితే అంతే సంగతులు 

న్యూస్ చానెల్స్ చెప్పేది మనం believe చేస్తే అంతే సంగతులు 

Workaholic – విపరీతంగా పని చేసేవాడు

వాడు పని రాక్షసుడు, మొదలు పెడితే అయ్యే వరకు నిద్ర పోడు 

వాడు workaholic, మొదలు పెడితే అయ్యే వరకు నిద్ర పోడు6 

Convince – ఒప్పించటం

రాకేష్ వాళ్ళని ఒప్పించాడు 

రాకేష్ వాళ్ళని convince చేశాడు 

Wet – తడి

Careful – జాగ్రత్తగా

Slippery – జారేటట్టు

నేల కొంచం తడిగా ఉంది, జాగ్రత్తగా చూసుకుని నడవండి. బాగా జారుతుంది.

నేల కొంచం wetగా ఉంది, carefulగా చూసుకుని నడవండి. బాగా slipperyగా ఉంది 

Well wisher – శ్రేయోభిలాషి, మంచి కొరేవాడు

వాడు మన మంచి కోరేవాడు

వాడు మన wellwisher 

Favourable – అనుకూలంగా

పరిస్థితులు అనుకూలించటం వల్ల మనం అనుకున్నది జరిగింది 

పరిస్థితులు favourableగా ఉండటం వల్ల మనం అనుకున్నది జరిగింది 

Criticise – విమర్శ

విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్దాం 

Criticise చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ మాటలు ignore చేసి ముందుకు వెళ్దాం 

Atheist – నాస్తికుడు

అతను నాస్తికుడు దేవుడిని నమ్మడు, వాడి శ్రమనే నమ్ముతాడు 

అతను Atheist దేవుడిని నమ్మడు, వాడి శ్రమనే నమ్ముతాడు 

Careless – అజాగ్రత్త

మరీ ఇంత అజాగ్రత్తగా ఉంటె ఎలా? 

మరీ ఇంత Carelessగా ఉంటె ఎలా? 

Beard – గడ్డం

వాడేంటి కొత్తగా గడ్డం పెంచుతున్నాడు? 

వాడేంటి కొత్తగా beard పెంచుతున్నాడు? 

Confusion – గందరగోళం

Confusion గా వుంది

గందరగోళంగా వుంది 

Solution – పరిష్కారం, Solve – పరిష్కరించడం

Solve చెయ్యండి

పరిష్కరించండి 

Think – ఆలోచించటం

Thought – ఆలోచన

Think చేస్తున్నాను

ఆలోచిస్తున్నాను 

Amazing – చాలా బాగుంది, అద్భుతమైన

సినిమా Amazing కదా

సినిమా అద్బుతం కదా 

Uncomfortable – అసౌకర్యం

Uncomfortable గా ఉంది

అసౌకర్యంగా ఉంది

Comfortable – సౌకర్యం

ఈ కుర్చీ చాలా Comfortableగా ఉంది.

ఈ కుర్చీ చాలా సౌకర్యంగా ఉంది.

Help – సహాయం

వాళ్లకు ఏదైనా Help చేద్దాం

వాళ్లకు ఏదైనా సహాయం చేద్దాం 

Donation – విరాళం

Donate చేద్దాం

విరాళం ఇద్దాం

Guidance – మార్గదర్శకత్వం, దారి చూపుట

Guidance ఇస్తారా?

దిశానిర్దేశం చేస్తారా?

Taste – రుచి

Taste బాలేదు కదా

రుచిగా లేదు కదా 

Beautiful కదా – అందంగా వుంది కదా

రవితేజ సినిమాలు Hilarious గా ఉంటాయి.

రవితేజ సినిమాలు చాలా నవ్వు తెప్పిస్తాయి.

Jovial – నవ్వుతూ, సంతోషంగా, సరదాగా

మధురిమ చాలా jovial గా ఉంటుంది. అందరితో ఇట్టే కలిసిపోతుంది.

మధురిమ చాలా సరదాగా ఉంటుంది. అందరితో ఇట్టే కలిసిపోతుంది.

Spontaneous – అప్పటికప్పుడు, సమయస్ఫూర్తితో

యాంకర్ సుమ చాలా spontaneousగా జోకులు వేసి అందరినీ నవ్విస్తుంది.

యాంకర్ సుమ సమయస్ఫూర్తితో జోకులు వేసి అందరినీ నవ్విస్తుంది.

Split second – రెప్పపాటు కాలంలో

ఆలోచించే టైం కూడా లేదు, split second లో అంతా జరిగిపోయింది.

ఆలోచించే టైం కూడా లేదు, కన్ను మూసి తెరిచే లోపే అంతా జరిగిపోయింది.

Huge – చాలా పెద్దది, భారీ

Man Power – సిబ్బంది

ఆ కంపెనీ వారికి ఏదో huge project వచ్చిందట, 500 మంది man power కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారు.

ఆ కంపెనీ వారికి ఏదో పెద్ద project వచ్చిందట, 500 మంది సిబ్బంది కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారు.

Mixed feelings – ఏదైనా ఒక విషయం/ వ్యక్తి/ఆలోచన మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పరచుకోలేని సందర్భంలో ఈ పదము వాడతారు.. 

రాము : ఆ వ్యక్తి మీద నీ అభిప్రాయం ఏంటి? 

రజనీ : ఏమో అతను నాకు అర్దం కాలేదు, అతని మీద నాకు mixed feelings ఉన్నాయి.

Conclusion – ముగింపు, చివరిగా మనం తేల్చి చెప్పేది. 

చివరిగా ఏమి conclude చేశారు?

చివరిగా ఏమి తేల్చారు?

Calculated – లెక్కలు వేసి

అన్ని విషయాల్లో calculated గా ఉండే అతను ఈ ఒక్క విషయంలో లెక్కలు పక్కనపెట్టి మనసుతో ఆలోచించాడు. 

అన్ని విషయాల్లో లెక్కలు వేసే అతను ఈ ఒక్క విషయంలో లెక్కలు పక్కనపెట్టి మనసుతో ఆలోచించాడు. 

Crispy – కరకరలాడుతూ

చిప్స్ కరకరలాడుతూ బాగున్నాయ్ కదా?

చిప్స్ Crispy గా బాగున్నాయ్ కదా?

Let’s do it – చేద్దాం పదా, చేద్దాం. 

Figure out – తెలుసుకోవటం

ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నావా?

అదే పనిలో ఉన్నాను, figure out చేయటానికి కొంచం time పడుతుంది. 

Brief – క్లుప్తంగా

సోదిపెట్టకుండా, జరిగిందేమిటో కొంచం brief గా చెప్పు

సోదిపెట్టకుండా, జరిగిందేమిటో క్లుప్తంగా రెండుముక్కల్లో చెప్పు

Filthy – అపరిశుభ్రంగా

underestimate – తక్కువ అంచనా 

అమ్మ : రెండు రోజులు నేను లేకపోతే ఈ place ఇంత filthyగా చేస్తారని ఊహించలేదు.

కొడుకు : నువ్వు నా సామర్ధ్యాన్ని చాలా underestimate చేస్తున్నావ్. 

అమ్మ : రెండు రోజులు నేను లేకపోతే ఈ place ఇంత అపరిశుభ్రంగా మారుస్తావు అని ఊహించలేదు.

కొడుకు : నువ్వు నా సామర్ధ్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావ్

Eager – చాలా ఆసక్తిగా 

లక్ష్మి అమెజాన్ లో ఐఫోన్ ఆర్డర్ పెట్టింది, ఎప్పుడొస్తుందా అని చాలా eagerగా వెయిట్ చేస్తుంది.

లక్ష్మి అమెజాన్ లో ఐఫోన్ ఆర్డర్ పెట్టింది, ఎప్పుడొస్తుందా అని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తుంది.