ఇంటర్వ్యూ కమ్యూనికేషన్ స్కిల్స్

ఇంటర్వ్యూ రూమ్ లో అడుగుపెట్టడానికి ముందే మీ విలువ ఎంతో తెలుసుకోండి. ఇండస్ట్రీలో మీ స్థాయి ఉద్యోగులు ఎంత జీతం సంపాదిస్తున్నారో రీసెర్చ్ చేయండి. 

మీకు Payscale.com, Glassdoor.com లాంటి websites ఉపయోగపడతాయి. 

ఈ వెబ్ సైట్స్లో ఇన్ఫర్మేషన్ 100% accurate కాకపోయినా, మీకు ఒక rough ఐడియా వస్తుంది. తరువాత మీ సీనియర్స్, వేరే కంపెనీలలో పనిచేస్తున్న ఫ్రెండ్స్ ని కనుక్కోండి.

వీలైతే మీరు ఏ కంపెనీలో ఇంటర్వ్యూ కి వెళ్తున్నారో, అక్కడకు ఒక రోజు ముందే వెళ్లి లంచ్ టైమ్ లో బయటకు వచ్చిన employees తో మాట్లాడే ప్రయత్నం చేయండి. వీళ్ళు మీకు గోల్డెన్ టిప్స్ ఇస్తారు. 

అందరూ వాడే పదాలు వాడవద్దు. Hardwork, Passion, Creativity, Problem solving లాంటి మాటలకు దూరంగా ఉండండి. ఇవన్నీ మీకు ఉన్నాయని చెప్పండి, కానీ ఈ మాటలు వాడకుండా చెప్పండి

మీ పాత ఆఫీసులో సమస్య వచ్చినప్పుడు మీరు ఆలోచించిన ఒక క్రియేటివ్ సొల్యూషన్, దాని వల్ల కలిగిన quantifiable బెనిఫిట్స్ గురించి మాట్లాడండి

మీరు ఇచ్చిన సొల్యూషన్ వల్ల అందరూ fast గా పని పూర్తిచేయగలిగారు. ఇది 

చాలా weak statement. ఆలా కాకుండా, నేను ఇచ్చిన సొల్యూషన్ వల్ల 30 రోజుల్లో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్ట్ కేవలం 25 రోజుల్లోనే పూర్తి అయ్యింది. Management కి సుమారుగా రెండు  లక్షల రూపాయల ఖర్చు తగ్గించాను. ఇది చాలా strong statement.

అప్రమత్తంగా ఉండండి. అన్నిరౌండ్స్ చక్కగా పూర్తిచేసిన తరువాత లాస్ట్ రౌండ్ లో ఒక ఫ్రెండ్లీ పర్సన్, వచ్చి మీరు చాలా బాగా చేశారు. ఇది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే, రిలాక్స్. అంటారు. ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండండి.  రిలాక్స్ అవ్వకండి.

అవతలి వ్యక్తి కొంచం నవ్వుత్తూ ఫ్రెండ్లీగా మాట్లాడితే కొంత మంది full గా ఓపెన్ అయిపోతారు. Flowలో నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా, ఏ విషయం చెప్పచ్చు, ఏ విషయం సీక్రెట్ గాఉంచాలి అనే విషయం ఇంటి దగ్గరే డిసైడ్ అయ్యి వెళ్ళండి. 

ఉదాహరణకు మీరు మాటలు సందర్భంలో మీ ఇంట్లో ఐదుగురు ఉన్నారు, మీరొక్కరే సంపాదిస్తున్నారు అని చెప్పారనుకోండి, మీకు ఈ ఉద్యోగం ఎంత అవసరమో తెలిసిపోతుంది. ఈ పాయింట్ పట్టుకుని వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది జాగ్రత్త 

మీ పని, మాకు బాగా నచ్చింది. కానీ మీరు అడుగుతున్న జీతం ఇవ్వలేము. మా కంపెనీ చాలా చిన్నది, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాము. మీ లాంటి సీనియర్స్ సహాయం మాకు కావాలి. ప్లీజ్… కొంచం శాలరీ తగ్గించుకోండి.

ఇలా రిక్వెస్ట్ చేసినప్పుడు, 5 డే వర్క్ వీక్ అడగండి. అంటే శని, ఆదివారాలు సెలవు తీసుకోండి. చక్కగా ఇంటికొచ్చి freelance చేసుకోవచ్చు. శాలరీ comprimise అయినా కనీసం చక్కగా మంచి ఫ్రీ time దొరుకుతుంది.

అర్ధం కానప్పుడు అడగండి. సంభాషణ జరుగుతున్నప్పుడు, ప్రతి ఒక్క మాట చాలా జాగ్రత్తగా వినండి.  మీరు చెప్పింది, నాకు ఇక్కడ వరకు అర్ధమయ్యింది. పలానా మాట దగ్గర నుంచి నాకు అర్ధం కావట్లేదు, మళ్ళీ రిపీట్ చేస్తారా ప్లీజ్…  అని అడగండి. ఇలాచేయటం వల్ల అవతలి వాళ్లకు మీరు చాలా జాగ్రత్తగా follow అవుతున్నారన్న విషయం తెలుస్తుంది.

ప్రతి  కంపెనీలో ఎదో ఒక  సమస్య వల్ల ఇబ్బందులు వస్తాయి. దాని వల్ల అందరూ చాలా frustrate అయ్యి ఉంటారు.  మీరు వెళ్లబోయే కంపెనీలో ఆలా జరిగిన విషయం తెలుసుకోండి. దానికి సొల్యూషన్ ఏంటో రీసెర్చ్ చేసి తెలుసుకోండి . అది చక్కగా ఒక పేపర్  మీద రాసుకోండి. ఆ సొల్యూషన్ వాళ్ళతో చెప్పండి. 

ఈ సొల్యూషన్ చెప్పేటప్పుడు, మీకు ఈ ప్రాబ్లెమ్ ఉంది. ఇదిగో మీకు తెలియని విషయం నాకు తెలుసు అనే పొగరు తో చెప్పకండి.  అసలు మా కంపెనీలో అలంటి ప్రాబ్లెమ్ లేదు అని బుకాయిస్తారు. అసలు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడుగుతారు.

అందుకని ఇలా చెప్పండి. సాధారణంగా మన ఇండస్ట్రీలో అందరికీ వచ్చే సమస్యల గురించి నేను రీసెర్చ్ చేశాను, దానికి సోలుషన్స్ వెతుకుతున్నాను. ఇవి నాకు తట్టిన కొన్ని సోలుషన్స్, ఊరికే మీకు చూపించాలనిపించింది అని చెప్పండి. బయటకు చెప్పకపోయినా, వాళ్ళు మనసులో  మీకు ఓటు గుద్దేస్తారు. సోలుషన్స్ తప్పయినా మీ హోంవర్క్ చేసే విధానం వాళ్ళకి నచ్చుతుంది.

మీరు అడగాలుకున్న వన్నీ ఒక చిన్నచీటీలో రాసి తీసుకెళ్లండి. శ్రీమంతుడిలో మహేష్ బాబు లాగా. ఇది ముఖ్యమైన విషయాలు మర్చిపోకుండా మీకు హెల్ప్ చేస్తుంది.

ఇంటర్వ్యూ చేసే వ్యక్తికీ మీరు ఎంత planned గా ఉంటారో అర్ధం అవుతుంది. చీటీ తీసుకెళ్తే మీకు మతిమరపు అని ఎవరూ అనుకోరు, ఇంటర్వ్యూ ప్రెషర్ వల్ల చాలా మంది మాట్లాడాలనుకున్న విషయాలు మర్చిపోతారు. కాబట్టి ఇది totally acceptable!

స్క్రిప్ట్ రాయద్దు. ఈ ప్రశ్న అడిగితే, ఇలా చెప్పాలి అని ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతారు చాలా మంది. ఇలా చేయటం వల్ల అవతలి వాళ్ళు అడిగిన ప్రశ్న వినకుండా, మీ flowలో మీరు ప్రిపేర్ అయ్యిందే మాట్లాడతారు.  అంటే ఏ ప్రశ్న అడిగినా మీరు ప్రిపేర్ అయిన విషయం కక్కేయాలనిపిస్తుంది.