చెడు అలవాట్లు మీ జీవితంలోకి రాకుండా ఆపటం ఎలా?

మరీ ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఆక్టివిటీ ఏదైనా దాన్ని ఎక్కువ రోజులు మీ లైఫ్ లో ఉండనివ్వద్దు. 

ఆ ఆక్టివిటీ మీ Life లోకి వచ్చిన మొదటి రోజు మాత్రమే మీరు కంట్రోల్ లో ఉంటారు, అప్పుడే దాన్ని దూరం పెట్టేయాలి  ఓ వారం రోజులు ఆగితే అది మీ నెత్తికి ఎక్కి కూర్చుని మిమ్మల్ని ఎప్పటికీ వదలదు.

Tik Tok, PUBG, Game of Thrones  – ఇలా ఏ addictive material అయినా, అది మీకు ఇచ్చే కిక్కు స్థాయిని బట్టి అది ఎంత ప్రమాదకరమో అన్న విషయం మీరు మొదటి రోజే realize అవ్వాలి. 

మీకు ఎంత బాగా నచ్చితే అంత దూరం పెట్టేయాలి.

ప్రపంచం మొత్తమ్ trending అవుతున్న టాపిక్ అయితే, అదో పెద్ద Redflag క్రింద పరిగణించండి. దాని నుంచి కుదిరినంత దూరం పారిపోండి. కొన్ని కోట్లమందికి నచ్చిందంటే అది ఖచ్చితంగా ఉపయోగపడని విషయం అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. కొన్ని కొట్లమంది ఎప్పుడైనా ఒక మంచి విషయం పైన ఆకర్షితులు అవ్వటం మీరు చుశారా?

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Psychologists, Neuroscience Experts Hospitals లో ఉండరు అన్న విషయం మీకు తెలుసా? వాళ్ళు గేమింగ్, సోషల్ మీడియా platforms లో పనిచేస్తుంటారు. వాళ్ళ టార్గెట్ మీరే. మిమ్మల్ని బానిస చేయటం ఎలా అని ప్రణాళిక రూపొందించటమే వాళ్ళ జాబ్. వాళ్ళ చేతిలో మీరు మోసపోకూడదు అంటే, అది మొదటిరోజు మాత్రమే సాధ్యం అవుతుంది. మీ మీద మీకు కంట్రోల్ ఉన్నపుడే దాన్ని దూరం పెట్టాలి.

ఇదే విషయం relationships లో కూడా వర్తిస్తుంది. ప్రేమ అనేది ఒక మత్తు. ఆ మత్తు మొదటిరోజు చవి చుసిన వెంటనే దూరం చేయాలి. సమయం కానీ సమయంలో relationship మంచిది కాదు. 

ఒక అమ్మాయిని మొదటి రోజే కట్ చేయటం చాలా సులభం, ఆ అమ్మాయితో పులిహోర, బిర్యానీ, దద్దోజనం కలిపి తరువాత ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాం అని బాధ పడటం ఎందుకు?

మొదటి రోజు అమ్మాయి నచ్చిన వెంటనే, మెంటల్ గా Fix అవ్వండి. దూరంగా ఉండాలి ఆ అమ్మాయితో ఎలాంటి relationship కోసం Try చేయను అని. అమ్మాయిలను చూసి నేత్రానందం పొందడానికి నేను విరుద్ధం కాదు. కానీ  పంచాయితీ ఆపేయండి. ఎలాంటి initiative తీసుకోవద్దు, ఆ పువ్వును తెంపి ఆనంద పడాలని చూడద్దు. చెట్టుకున్న పువ్వును టచ్ చేయకుండా చూసి ఆనందం పొందండి.