మీ పిల్లల ముందు జీరో అవ్వండి


చదువులో వెనుకబడిన పిల్లలలో చాలా common గా ఉండే ఒక లక్షణం – సందేహాలు నివృత్తి చేసుకోకుండా silentగా ఉండటం.

చదివే topic లో doubt వచ్చి Friends ను అడుగుదామంటే “ఏరా నీకు ఇది కూడా తెలియదా?” అని నవుతారు. టీచర్ ను అడిగితే  “చెప్పేటపుడు గాడిదలు కాస్తున్నావా” అని కోప్పడతారు.

అందుకే విద్యార్థులు ఎన్ని doubts ఉన్నా అడగకుండా silent గా ఉండిపోతారు. ఆ doubts ఎప్పటికీ అలానే ఉండి పోతాయి.

కనీసం ఇంట్లో అయినా పిల్లలు openగా మాట్లాడే వాతావరణం తల్లిదండ్రులు కల్పించాలి.

పిల్లలు తల్లిదండ్రుల గురించి ఏమనుకోవాలంటే

“ఎంత Silly Doubt అడిగినా అమ్మ, నాన్న నన్ను తిట్టరు, కొట్టరు, నవ్వరు. నాకు బాగా అర్ధం అయ్యేలా వివరించి చెప్తారు. అర్ధం అయ్యేవరకు చెప్తారు. ఎన్ని సార్లయినా చెప్తారు. నన్ను విసుక్కోరు!”

ఇలాంటి confidence మీ పిల్లలకు మీ మీద రావాలి. అప్పుడు వాళ్ళు openగా మీతో మాట్లాడటం మొదలు పెడతారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ముందు హీరోలుగా ఉండాలనుకుంటారు. బయట ఎలా ఉన్నా పిల్లల ముందు మాత్రం “మిస్టర్ పర్ఫెక్ట్” ఇమేజ్ maintain చేయాలని ప్రయత్నిస్తారు.

జెర్సీ సినిమాలో నాని డైలాగు గుర్తుందా?

ఇదే అసలు సమస్య! ఇలా పిల్లల దృష్టిలో పర్ఫెక్ట్ ఇమేజ్ create చేయటం వల్ల తల్లిదండ్రుల ఇగో బూస్ట్ అవుతుందే కానీ, పిల్లలకు మాత్రం నష్టం జరుగుతుంది.

బలహీనుడు ఎప్పుడూ బలవంతుడికి తన కష్టాలు చెప్పుకోడు. బలహీనుడు మరో బలహీనుడి దగ్గరకే వచ్చి తన బాధలు చెప్పుకుంటాడు.

ఒక బలహీనుడి బాధ మరో బలహీనుడికి మాత్రమే అర్ధం అవుతుంది కాబట్టి. అమ్మాయిలు కూడా చూశారా? భర్తతో చెప్పలేని విషయాలు బెస్ట్ ఫ్రెండ్స్(అమ్మాయిలు)తోనే  పంచుకుంటారు. ఒక వేళ భర్తతో చెప్తే కొట్టి పడేస్తాడు కాబట్టి
“ఏంటి దీనికి ఇంత గోల చేస్తావ్, దీనికి ఎవరైనా ఏడుస్తారా? లైట్ తీసుకో”

ఇలా భర్త అన్న ప్రతీ సారి భార్య మనసులో మెదిలే మాటలు “ఎంత చెప్పినా వీడికి నా బాధ అర్ధం కాదు”

కాబట్టి మీ పిల్లల ముందు హీరోలా బిల్డప్ ఇవ్వకుండా ముందు వచ్చి నేల మీద నుంచోండి. మీకు కూడా వాళ్ళకున్న సమస్యలే ఉన్నాయని, వాళ్ళకంటే ఎక్కువ బాధ మీకు కూడా ఉంటుందని వాళ్లకు తెలిసేలాగా చేయాలి. జీరోలా ఫీల్ అవుతున్న పిల్లలకు మీరు కూడా ఒక జీరోలాగానే కనిపించండి.

 ఇప్పుడు నేను చెప్పబోయే process తుచా తప్పకుండా ఫాలో అవ్వండి. 

 మీ పిల్లల్ని ఒక మంచి చోటుకు తీసుకువెళ్ళండి (ఓ మంచి restaurant, లేదా వాళ్లకు నచ్చిన షాపింగ్ మాల్) వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకుండా చూడండి. మీ ఫోన్ కూడా కాసేపు స్విచ్ ఆఫ్ చేయండి. 

ఈ స్క్రిప్ట్ ను ఉన్నది ఉన్నట్టు వాళ్ళతో చెప్పండి.

“ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆఫీసులో నా problems అన్నీ solve అయిపోయాయి. అందుకే మీకు ఈ ట్రీట్ ఇస్తున్నాను. ఈ రోజు మీకు నచ్చినంత Ice Cream తినండి ”

ఎలా solve అయ్యాయి నాన్న? అని పిల్లలు అడుగుతారు. అప్పుడు ఇలా చెప్పండి…

“అసలేమైందంటే నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో క్లాస్ చెప్పేటప్పుడు సరిగ్గా వినేవాడిని కాదు, నిద్ర వచ్చేది. చాలా టాపిక్స్ అలా మిస్ అయ్యాను. అందుకే ఆఫిసులో సమస్యలు వచ్చేవి. అవి ఎవరినైనా అడుగుదామంటే నవుతారేమో అని భయం. అందుకని గప్ చుప్ గా ఉండేవాడిని. ఎవరినీ అడగలేని పరిస్థితి. ఈ మధ్య ధైర్యం చేసి మా సీనియర్ ను అడిగాను. ఆయన చక్కగా అన్నీ వివరించి చెప్పారు. ఆ doubts నివృత్తి చేసుకోవటం వల్ల ఇప్పుడు నేను ఆఫిసులో అందరికంటే బాగా పనిచేస్తున్నాను.

మీరు కూడా క్లాస్ లో ఏదైనా doubts వస్తే సిగ్గుపడకుండా అడిగేయండి. క్లాస్ టీచర్ ను, ఫ్రెండ్స్ ను అడిగితే నవుతారని నాకు తెలుసు. అందుకే ఇంటికి వచ్చి నన్ను అడగండి. నాకు కుదిరినంత help చేస్తాను. నాకు తెలియకపోతే ఇంటర్నెట్ లో వెతికి సమాధానాలు తెలుసుకుంటాను. ప్రతి రోజూ సరదాగా ఒక 15 నిముషాలు కూర్చుంటే మీ సమస్యలన్నీ solve అవుతాయి”  

ఇప్పుడు మీ పిల్లలకు మీ మీద ఓ చిన్న నమ్మకం ఏర్పడుతుంది. నాన్నకు కూడా నాకున్న సమస్యనే ఉంది, నన్ను అర్ధం చేసుకుంటారు.

వాళ్ళకున్న ఓ చిన్న doubt మిమ్మల్ని అడుగుతారు. అది విని మీరు గుండె పోటు తెచ్చుకోకూడదు. ఎదో సునామీ వచ్చినట్టు రియాక్ట్ అవ్వకూడదు.

మీరు ఊహించలేనంత సిల్లీగా ఉంటుంది ఆ doubt.

ఉదాహరణకు ఓ 10వ తరగతి అబ్బాయికు Perpendicular, Adjacent అంటే  ఏంటో తెలియదు. Greater than, less than symbols మధ్య confusion. 

లక్షలు  పోసి చదివిస్తున్న  మీకు, ఇలాంటి doubt వినగానే కోపం కట్టలు తెగిపోతుంది. మీ  స్కూల్లో ఇది కూడా నీకు చెప్పలేదా? ఇది తెలియకపోవటం ఏంటి? ఇలాంటి రొటీన్ రియాక్షన్ ఇచ్చారంటే, ఇక అంతే సంగతులు! మీరు పడ్డ కష్టం అంత వృధా అవుతుంది.

ప్రశాంతంగా వాళ్ళు అడిగిన సమస్యలు నివృత్తి చేయండి. ఇసుమంతైనా కోపం, చిరాకు మీ మాటల్లో కనిపించకూడదు.

మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళు అంత చక్కగా open అవుతారు. 

ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మాటలు అనకూడదు – మీ Schoolకు వచ్చి దీని  గురించి మాట్లాడతాను, మీ ట్యూషన్ టీచర్ కు చెప్తాను. వాళ్ళు బాగా explain చేస్తారు. 

ఇలాంటి తిక్క పనులు చేయద్దు. ఇలా చేస్తే వాళ్లకు మీరు కొత్త సమస్యలు create చేసినట్టే. స్కూల్లో, ట్యూషన్ లో పిల్లలను అర్ధం చేసుకునే టీచర్స్ చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు అంత మంచి టీచర్స్ అయితే, మీ పిల్లలకు అసలు ఇలాంటి పరిస్థితే వచ్చేది కాదు.

నేను చెప్పిన ఈ పద్దతిని మీరు ఆచరణలో పెట్టి మీకు మంచి ఫలితం వస్తే దయచేసి నాకు ఓ చిన్న ఇమెయిల్ వ్రాయండి – avinashvlog@gmail.com