మీ పిల్లలు చదివే మెటీరియల్ అందంగా, ఆకర్షనీయంగా ఉందా? లేదా భయపెట్టేలాగా ఉందా?


అందానికి ఆకర్షింపబడటం, భయానకంగా ఉండే వాటికి దూరంగా మనుషుల స్వభావం. దానికి ఎవరూ మినహాయింపు కారు. అందమైన వ్యక్తుల దగ్గర మనకు తెలియకుండానే ఎక్కువ సమయం గడుపుతాము. అందమైన ప్రదేశంలో కుదిరినంత సేపు ఉండాలని ప్రయత్నం చేస్తాము. అలాగే అందంగాలేని ప్రదేశాలు, వ్యక్తులతో వెంటనే connect అవ్వలేము.

(అందం కంటే మంచి మనసు ముఖ్యం అని దయచేసి కుళ్లిపోయిన వాట్సాప్ కొటేషన్స్ చెప్పకండి ప్లీజ్)

పిల్లలు చదువుకునే పుస్తకాలు చూడటానికి భయపెట్టేవిధంగా ఉంటాయి. వాటిని కుదిరినంత ఆకర్షణీయంగా, సులభంగా ఉండేలా మనం డిజైన్ చేస్తే వాళ్లకు చదువు మీద ఉన్న ఆసక్తి పెరుగుతుంది.

మీ పిల్లల స్టడీ మెటీరియల్ డిజైన్ చేయటానికి ఈ కింద ఉన్న టిప్స్ ఫాలో అవ్వండి.

ఒకే మెటీరియల్ అందరు పిల్లలకు పని చేయదు. కొంత మంది పిల్లలు అవలీలగా పెద్ద పెద్ద టాపిక్స్ గుర్తుపెట్టేసుకుంటారు. చదివే టాపిక్ 100 పదాలైనా, 500 పదాలైనా ఈజీగా నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలకు 50 పదాలు మించిన టాపిక్ చూస్తే వణుకు మొదలవుతుంది. అలంటి పిల్లలు 200 పదాల టాపిక్ చూస్తే వాళ్ళు చదివే 50 పదాలు కూడా చదవరు. కాబట్టి వాళ్ళకు comfort కు దగ్గరగా ఓ 60,70 పదాలు ఉండేటట్టు మెటీరియల్ తయారు చెయ్యండి.

ఊపిరి ఆడకుండా పంక్తులు ఉంటె వాటిని కాస్త విడతీయండి: ఎడమ వైపు ఉన్న మెటీరియల్ మరియు కుడివైపు ఉన్న మెటీరియల్ మధ్య వ్యత్యాసం చూడండి.కుడివైపు ఉన్న మెటీరియల్ చూడటానికి కాస్త relaxingగా ఉంది. Visual notes తయారు చేయండి, లేదంటే ఇంటర్నెట్ లో వెతకండి Google images + Google Slides software సహాయంతో పై వీడియోలో చూపించినట్టు ఆకర్షణీయమైన Flash Cards తయారు చేయచ్చు. చాలా సందర్భాలలో అంత కష్టపడకుండానే కాస్త ఓపిగ్గా వెతికితే మీకు కావలసిన మెటీరియల్ ఇంటర్నెట్ లోనే దొరుకుతుంది.

Visual notes తయారు చేయండి, లేదంటే ఇంటర్నెట్ లో వెతకండి. Google images + Google Slides software సహాయంతో పై వీడియోలో చూపించినట్టు ఆకర్షణీయమైన Flash Cards తయారు చేయచ్చు. చాలా సందర్భాలలో అంత కష్టపడకుండానే కాస్త ఓపిగ్గా వెతికితే మీకు కావలసిన మెటీరియల్ ఇంటర్నెట్ లోనే దొరుకుతుంది.

Slideshare అనే వెబ్సైటులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది టీచర్స్ వాళ్ళ విద్యార్థుల కోసం చేసిన మెటీరియల్/పవర్ పాయింట్ స్లైడ్స్ అప్లోడ్ చేస్తారు అవి మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులకు ఉపయోగపడే మరో అద్భుతమైన వెబ్సైట్ Khan Academy. దీనిగురించి ఎంత చెప్పినా తక్కువే. వేల పాఠాలు, ఆర్టికల్స్ మరియు exercises ఉచితంగా చూడచ్చు. (2010లో ఖాన్ అకాడమీ సత్తా చూసి Bill gates 1.5 మిలియన్ డాలర్స్ ఇచ్చి ఈ వెబ్సైటు ను ప్రోత్సహించారు)

కష్టమైన సబ్జక్ట్స్ నేర్పించేటపుడు వాటి మీద ఏవైనా కార్టూన్స్ దొరుకుతాయేమో ఓ సారి చుడండి. గూగుల్ లో సబ్జెక్టు పేరు + cartoon అని వెతకండి. క్రింద ఉన్న కార్టూన్ OHM’s law కు సంబంధించింది. Ohms law cartoon అని వెతికితే ఇది దొరికింది.

మీ reference కోసం వీడియోలో చూపించిన flash కార్డ్స్ ఇక్కడ ఉంచుతున్నాను.

ఈ articleలో మరిన్ని ఉపయోగపడే links, టిప్స్ తో తరచూ update చేసే ప్రయత్నం చేస్తాను. ఈ పేజీని save చేసుకోండి.