దేనికీ పనికిరాని ఏనుగు ఓదార్పు

ఓ చిట్టెలుక గుండుసూది గుచ్చుకుని బాధతో అరుస్తుంటే, అటుగా వెళ్లే ఒక ఏనుగు వచ్చి “నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నిన్ననే నాకు ఓ గుండు సూది గుచ్చుకుంది. నేను ఏడ్చానా? ఇంత చిన్న దానికే అలా గోల చేస్తే ఎలా? ఏమీ కాదు, ధైర్యంగా ఉండు” అని ఓదార్చి వెళ్ళిపోయింది.

గుండు సూది గాయం ఏనుగును ఏమీ చేయలేదు, కానీ చిట్టెలుకను చంపగలదు. ఈ విషయం ఏనుగుకు తెలియదు.

ఏనుగు ఓదార్పు వలన ఉపయోగం లేకపోగా చిట్టెలుక మనసు నొచ్చుకుంది.

“నీ బాధ నేను అర్థం చేసుకోగలను” అని మీరు ఎవరితోనైనా అనేటప్పుడు మీరు ఈ కథలో ఏనుగు లాంటి వారు అని గుర్తుచేసుకోండి.

ఒక బలహీనుడికి బలవంతుడు ధైర్యం చెప్పటం చాలా రొటీన్ అయిపోయింది. ఇద్దరి ప్రపంచం వేరు. ఇద్దరి అనుభవాలు వేరు. కాబట్టి బలవంతులకు నాదొక మనవి, మీరు ఎవరినీ ఓదార్చకండి. ఎవరికీ ధైర్యం చెప్పకండి ప్లీజ్. ఎవడి ఏడుపు వాడిని ఏడవనియ్యండి.

-ఆవినాష్ కుమార్

avinashvlog@gmail.com