వెన్నపూస లాంటి మనసు!

By Avinash | November 7, 2020

కొన్ని సందర్భాలలో మన శత్రువులు లేదా మనకు ఎంతో నష్టం చేసిన వ్యక్తులు ఏడ్చినా మన హృదయం ద్రవించి పోతుంది. అలంటి సమయంలో మన పరిస్థితిని తప్పుగా అర్ధం చేసుకుని – నాది వెన్న పూస లాంటి మనసు అని అంటూ ఉంటాము. నిజానికి ఎవరికీ మనసు అనేది ఉండదు. మన శరీరంలో గుండె ఉంటుంది, మనసు కాదు. కవులు సృష్టించిన అబద్దం మనసు. ఇది మీకు వినటానికి చాలా కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. ప్రతి మనిషి శరీరంలో కొన్ని default settings ఉంటాయి. అంటే ఆటోమేటిక్ గా కొన్ని పనులు చేయించే mechanism అన్నమాట. వేడి నీళ్లు చేతి మీద పడిన వెంటనే మనం ఆలోచించకుండా చేయి తీసివేస్తాం. దూరం నుంచి వేగంగా ఏదైనా వాహనం వస్తుందట ఆలోచించకుండా తప్పుకుంటాం. వేరొకరు ఏడిస్తే మనకు కూడా ఏడుపు వస్తుంది ఇవన్నీ మనల్ని కాపాడటానికి ప్రకృతి మనలోపల పెట్టిన బుల్లి softwares. ప్రమాద సమయాల్లో ఆలోచించే సమయం కూడా మనకు ఉండదు, అలాంటప్పుడు ఈ లోపల ఉన్న బుల్లి softwares మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండానే మనల్ని కాపాడేస్తాయి. మీరు రోడ్డు మీద వేగంగా వెళ్తున్నపుడు అనుకోకుండా మీ బైకు స్కిడ్ అయ్యింది. ఎలా చేస్తున్నారో కూడా తెలియకుండా మీరు కొన్ని తెలివైన పనులు చేస్తారు. ఆ తరువాత ఆ accident నుంచి మీరు ఎంత తెలివిగా తప్పుంచుకున్నారు అని […]

READ MORE - పూర్తి పోస్టు చదవండి

మహాభారతం – అష్ఠనేత్రాస్త్రం – అనుబంధ వ్యాసం

By Avinash | July 22, 2020

ఒకో సారి మనకు ఎనిమిది కళ్ళు ఉన్నాయనిపిస్తోంది. నాకు అంతా కనిపిస్తుందని భ్రమ పడతాము. ఎనిమిది కళ్ళు ఉన్నా మనకు కనబడనివి చాలా ఉంటాయి, వీరాధివీరుడైన అర్జునుడి మనసులో ఏముందో ఎనిమిది కళ్ళు ఉన్న అష్ఠనేత్రాస్త్రం చూడలేకపోయింది.
ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను.

READ MORE - పూర్తి పోస్టు చదవండి

Elephant’s Pep Talk

By Avinash | July 6, 2020

ఓ చిట్టెలుక గుండుసూది గుచ్చుకుని బాధతో అరుస్తుంటే, అటుగా వెళ్లే ఒక ఏనుగు వచ్చి “నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నిన్ననే నాకు ఓ గుండు సూది గుచ్చుకుంది. నేను ఏడ్చానా? ఇంత చిన్న దానికే అలా గోల చేస్తే ఎలా? ఏమీ కాదు, ధైర్యంగా ఉండు” అని ఓదార్చి వెళ్ళిపోయింది.

READ MORE - పూర్తి పోస్టు చదవండి