వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు ఈ నోట్స్ పూర్తిగా చదవండి. వ్యాపారం ఎందుకు మొదలు పెడుతున్నారు అని అడిగితే, ఎక్కువ శాతం ఈ 5 కారణాలు చెప్తారు. ఒకరి కింద పని చేయటం ఇష్టం లేదు, సొంతగా ఏదైనా చేయాలని ఉంది. నా Talent ను ఉపయోగించుకుని నా బాస్ లక్షలు, కోట్లు సంపాదించుకుంటున్నాడు, అదేదో నేనే వ్యాపారం పెడితే ఆ డబ్బు నేనే సంపాదించవచ్చు కదా. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదు. బ్రతకడానికి డబ్బు కావాలి. బ్రతుకు తెరువు కోసం వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. బిల్ గేట్స్ లాంటి గొప్పవాళ్లను చూసి inspire అయ్యాను, కోట్లు సంపాదించాలని ఉంది, మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. చదువు అబ్బలేదు, ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఒకరి కింద పని చేయటం ఇష్టం లేదు, వత్తిడి తట్టుకోలేకపోతున్నాను. సొంతగా ఏదైనా చేయాలనుకుంటున్నాను. వ్యాపారం మొదలు పెట్టిన తరువాత ఒకరు కాదు వంద మంది క్రింద పనిచేయాలి. రూపాయి పెట్టి ఒక వస్తువు కొన్న ప్రతీ ఒక్కరూ మీ బాస్ లాగే ప్రవర్తిస్తారు. ఉద్యోగి బాస్ దగ్గర మాత్రమే తిట్లు తింటాడు. వ్యాపారం మొదలు పెట్టిన తరువాత సరిగ్గా సర్వీస్ సరిగ్గా చేయకపోయినా, కొద్దిగా విసుగు ప్రదర్శించినా, ఆ కస్టమర్ మీ గురించి వందల మందికి దుష్ప్రచారం చేస్తాడు. అతను తిట్టడం మాత్రమే కాకుండా వందల మంది చేత తిట్టిస్తాడు. ఒకరి క్రింద పనిచేయటం ఇష్టం లేదు […]
READ MORE - పూర్తి పోస్టు చదవండిఒక సారి ఈ డైలాగులు ఎక్కడైనా విన్నట్టుందేమో చుడండి.
కస్టమర్ దేవుళ్ళకు దీపావళి, రంజాన్, సంక్రాంతి శుభాకాంక్షలు. బంపర్ ఆఫర్! ధమాకా ఆఫర్! మతిపోయే డిస్కౌంట్స్! క్లియరెన్స్ సేల్!
ప్రతి pamplet మీద ఇలాంటివే రాసి ఉంటాయి. ఇలాంటి pamplets కుడిచేతితో తీసుకుని ఎడమచేతితో నలిపి పడేయటం మనకు అలవాటయిపోయింది.
READ MORE - పూర్తి పోస్టు చదవండిపరిచయం లేని వ్యక్తులకు ఈ – మెయిల్స్, కొరియర్ పంపటం గురించి నా వీడియోస్ లో ఇప్పటికే చాలా సార్లు ప్రస్తావించాను. కొరియర్ పంపేటప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మీ ప్యాకెట్ అవతలి వారి దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం గమనించాలి – అవతలి వ్యక్తి ఫేమస్ పర్సనాలిటీ అయితే… ప్రతి రోజూ ఎన్నో ఈ – మెయిల్స్ వస్తాయి.
READ MORE - పూర్తి పోస్టు చదవండి