కొన్ని సందర్భాలలో మన శత్రువులు లేదా మనకు ఎంతో నష్టం చేసిన వ్యక్తులు ఏడ్చినా మన హృదయం ద్రవించి పోతుంది. అలంటి సమయంలో మన పరిస్థితిని తప్పుగా అర్ధం చేసుకుని – నాది వెన్న పూస లాంటి మనసు అని అంటూ ఉంటాము.

నిజానికి ఎవరికీ మనసు అనేది ఉండదు. మన శరీరంలో గుండె ఉంటుంది, మనసు కాదు. కవులు సృష్టించిన అబద్దం మనసు.

ఇది మీకు వినటానికి చాలా కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం.

ప్రతి మనిషి శరీరంలో కొన్ని default settings ఉంటాయి. అంటే ఆటోమేటిక్ గా కొన్ని పనులు చేయించే mechanism అన్నమాట.

  • వేడి నీళ్లు చేతి మీద పడిన వెంటనే మనం ఆలోచించకుండా చేయి తీసివేస్తాం.
  • దూరం నుంచి వేగంగా ఏదైనా వాహనం వస్తుందట ఆలోచించకుండా తప్పుకుంటాం.
  • వేరొకరు ఏడిస్తే మనకు కూడా ఏడుపు వస్తుంది

ఇవన్నీ మనల్ని కాపాడటానికి ప్రకృతి మనలోపల పెట్టిన బుల్లి softwares. ప్రమాద సమయాల్లో ఆలోచించే సమయం కూడా మనకు ఉండదు, అలాంటప్పుడు ఈ లోపల ఉన్న బుల్లి softwares మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండానే మనల్ని కాపాడేస్తాయి.

మీరు రోడ్డు మీద వేగంగా వెళ్తున్నపుడు అనుకోకుండా మీ బైకు స్కిడ్ అయ్యింది. ఎలా చేస్తున్నారో కూడా తెలియకుండా మీరు కొన్ని తెలివైన పనులు చేస్తారు. ఆ తరువాత ఆ accident నుంచి మీరు ఎంత తెలివిగా తప్పుంచుకున్నారు అని మీ మిత్రులకు కథలు కథలుగా చెప్తారు. నిజానికి అక్కడ మీ తెలివి వాడి సరైన నిర్ణయం తీసుకోవటానికి కనీసం 10 సెకండ్స్ పడుతుంది. ఈ లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయేది.

ఇలాంటి సందర్భాలలో జరిగే చర్యలకు క్రెడిట్ మనం కొట్టేస్తాం! ఇదంతా మేమె చేసాం అని భ్రమలో ఉంటాం.

ఇలాంటి ఆటోమేటిక్ చర్యలలో ఒకటే వేరొకరిని బాధను చూసి మనం కూడా బాధ పడటం.

మనిషి సంఘ జీవి, వేరొక జీవితో ఉంటె అతను బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందరినుంచి దూరంగా వెళ్తే అతను బ్రతకడానికి అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి ప్రకృతి మనల్ని బ్రతికించటానికి మనకు empathy, sympathy ఇచ్చింది.

  • అయ్యో పాపం అని జాలి పడటం.
  • వేరొకరి బాధను మనం కూడా ఫీల్ అవ్వగలగటం.

ఈ రెండు గుణాలు మనం బ్రతకడానికి చాలా ఉపయోగపడతాయి. అయితే ఇవి అన్ని వేళలా కరెక్ట్ కాదు.

పాము మీద జాలిపడి, పాపం అని దానికి నీళ్లు పోసి దాని ఆయుష్షు 5 సెకండ్స్ మీరు పెంచినా అది ఆ చివరి నిముషంలో కూడా మిమ్మల్ని కాటేసి చంపుతుంది. లేకపోతే వేరొకరిని కాటేస్తుంది. అలంటి సందర్భాలలో క్షమాబిక్ష పెట్టడం మంచిది కాదు.

సుమతి శతకంలో ఒక మాట ఉంది. “అపకారికి ఉపకారం చేసినవాడు ధన్యుడు సుమతీ అని” అపకారికి ఉపకారం చేస్తే అతను మారి మనతో వైరం మానుకుంటాడేమో అనే చిన్న ఆశతో వ్రాసిన పద్యం.

మనుషులు స్వార్ధ బుద్దితో లేదా పరిస్థితుల ప్రాబల్యం వలన చేసే చిన్న తప్పులు చూసీ చూడకుండా వదిలేయటం తప్పేమీ కాదు. కానీ కొంతమంది పుట్టిన దగ్గరనుంచి గిట్టే వరకు అదేపనిగా అందరినీ ఇబ్బందులకు గురిచేస్తూ బ్రతికేస్తారు. అలంటి వారిని క్షమించి అతనికి మీరు సాయం చేస్తే, అతను భవిషత్తులో చేసే అన్ని పనులకు మీరు పరోక్షంగా కారకులు అవుతారు.

అందుకే గుర్తుంచుకోండి – అపకారికి ఉపకారం చేయువాడు మూర్ఖ శిఖామణి సుమతి! మానసిక దారుఢ్యం లేని వాడు సుమతి!