మీ వ్యాపారాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి ?

ఒక సారి ఈ డైలాగులు ఎక్కడైనా విన్నట్టుందేమో చుడండి.

కస్టమర్ దేవుళ్ళకు దీపావళి, రంజాన్, సంక్రాంతి శుభాకాంక్షలు. బంపర్ ఆఫర్! ధమాకా ఆఫర్! మతిపోయే డిస్కౌంట్స్! క్లియరెన్స్ సేల్! 

ప్రతి pamplet మీద ఇలాంటివే రాసి ఉంటాయి. ఇలాంటి pamplets కుడిచేతితో తీసుకుని ఎడమచేతితో నలిపి పడేయటం మనకు అలవాటయిపోయింది.

మీరు ఎంత ఖర్చుపెట్టి pamplets చేయించినా ఇదే జరుగుతుంది. కాబట్టి అందరూ వాడే ఈ cheap భాష వాడకండి.

మీరు వ్రాసిన pamplet అందరూ జాగ్రత్తగా తీసుకుని భద్ర పరుచుకునేదిలా ఉండాలి. అందరికీ ఉపయోగ పడే information ఉండాలి, దాని కింద మీ వ్యాపారానికి సంబందించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి. క్రింద ఉన్న pamplet design చుడండి.

80% నీలి రంగులో ఉంది, 20% నలుపు రంగులో ఉంది. 80% శాతం ఉపయోగ పడే సమాచారం, 20% మీ బిజినెస్ వివరాలు ఉండాలి. మీరు ఒక మాథ్స్ కోచింగ్ సెంటర్ నడుపుతుంటే మీ pamplet లో ఎక్కువ శాతం విద్యార్థులకు ఉపయోగ పడే ఫార్ములాస్ ఉండాలి. దాని కింద మీ కోచింగ్ సెంటర్ వివరాలు.

ఇది అన్ని వ్యాపారాలకు వర్తిస్తుంది. మీరు ఒక బైక్ గ్యారేజ్ నడుపుతుంటే. బైక్ maintainance టిప్స్ ఇవ్వండి. కిరానా షాపు నడుపుతుంటే వంట recipes గురించి pamplet ఇవ్వండి. బట్టల షాపు నడిపేవారు బట్టల maintainance గురించి టిప్స్ ఇవ్వండి. ఉదాహరణ: పట్టు చీరలను ఎలా జాగ్రత్తగా వాష్ చేయాలి? బట్టలు ఎక్కువకాలం మన్నాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇలాంటి టిప్స్ ఇవ్వండి. ఇలా చేస్తే మీ pamplet అందరూ పదిలంగా జాగ్రత్త చేసుకుంటున్నారు.