తక్కువ డబ్బుతో వ్యాపారం ఎలా మొదలు పెట్టాలో తెలిసిన తరువాత ఏమి జరిగింది?

అతి తక్కువ డబ్బుతో బిజినెస్ ఎలా పెట్టాలో తెలిసిన తరువాత నా ఆనందానికి అవధులు లేవు. ఆలస్యం అయినా నాకు కావలసిన information దొరికింది. ఇక ఆ పార్ట్ టైమ్ జాబ్ వదిలిపెట్టి, నా బిజినెస్ పెట్టడమే తరువాయి.

ఇంకాస్త డబ్బు చేతిలో ఉంచుకుని బిజినెస్ మొదలు పెడితే మంచిదని, మరో రెండు నెలలు ఆ పార్ట్ టైమ్ జాబ్ continue చేద్దాం అని నిర్ణయించుకున్నాను. మా బాస్ ను అడిగితే, వెంటనే కాంట్రాక్టు extend చేయడానికి అంగీకరించారు.

ఆ రెండు నెలల్లో నేను అస్సలు ఊహించనిది జరిగింది.

ఆ బిజినెస్ లో ఉన్న నెగటివ్ సైడ్ కనిపించింది. అప్పటి వరకు ఒక గోల్డెన్ ప్యాలస్ లాగా అందంగా కనిపించిన ఆ బిజినెస్, ఉన్నట్టుండి ఒక పబ్లిక్ టాయిలెట్ కంటే అసహ్యంగా కనిపించింది. లోతుగా వెళ్తే గానీ అసలు విషయం తెలుసుకోలేకపోయాను. పైపైన ఉన్న మెరుపులు చూసి ఇదే బెస్ట్ బిజినెస్ అని నేను అపోహపడ్డాను, కానీ ఆ బిజినెస్ కు నాకు అస్సలు సెట్ అవ్వదని అర్ధం అయిపోయింది.

డబ్బు లేకపోవటం వలన నేను చేతులు కాల్చుకోకుండా బయట పడ్డాను అని. అదే నా దగ్గర డబ్బు ఉండి ఉంటె, అనుకున్న వెంటనే ఆ వ్యాపారం పెట్టి చాలా డబ్బు పోగొట్టుకొని ఇదే ముక్క తెలుసుకునేవాడిని.

ఈ ప్రాజెక్ట్ ఒక disaster అనుకుంటే మీరు పొరబడినట్టే! సుమారుగా ఇది జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. నేను అనుకున్న వ్యాపారం పెట్టడానికి కుదరక పోయినా ఈ process లో నేను కలిసిన వ్యక్తులు, నాకు వచ్చిన అనుభవం వలన నా income పెరిగింది. ప్రత్యక్షంగా కాకపోయినా ఈ రోజుకీ నాకు ఆ అనుభవం ఉపయోగపడుతుంది, అక్కడ పరిచయమైన సీనియర్స్ నాకు ఇప్పటివరకు 30 మందికి పైగా clients ను పంపారు. నా resume లో ఒక పేజీ పెరిగింది. నా ఉద్దేశంలో ఇదంతా లాభమే! చతికిల పడి కూర్చుని ఏడిస్తే ఇదేమీ సాధ్యం అయ్యేది కాదు.