మాడిపోయిన దోస నువ్వు తిని, గోల్డెన్ దోస నీ పిల్లలకు పెడుతున్న ఓ మాతృమూర్తి నీ బుద్ది ఉందా?

తల్లి, భార్య, పిల్లలు చెప్పిన సరకుల లిస్టు తీసుకుని బయటకు వెళ్లి, తన shaving blades గురించి మర్చిపోయి అదే పాత బ్లేడుతో గడ్డం గీసుకునే ఓ వెర్రి

బాగుల తండ్రి నీకేమైనా మతి పోయిందా?

తండ్రి లేని ఇంటిలో అన్నీ నువ్వై అందరికీ అన్నీ ఇస్తూ నిన్ను నువ్వు మర్చిపోయిన పెద్దోడా నీకు ఇంకిత జ్ఞానం ఉందా?

ప్రతి ఇంటిలో త్యాగం చేయటానికే పుట్టిన ఓ వింత జీవి ఉంటుంది. అందరి అవసరాలు, కోరికలు తీరుస్తూ దాని గురించి అదే మర్చిపోతుంది. ఆ జీవిని

ముక్కోటి దేవతలు ఒకే సారి వచ్చినా కాపడలేరు.

మీరు అలాంటి జీవి అయితే మిమ్మల్ని లాగి పెట్టి ఓ సారి చెంప మీద గట్టిగా కొట్టాలని ఉంది. అలాగైన మీ మత్తు వదులుతుందేమో అని చిన్న ఆశ.

ఏంటి? ఎదో పెద్ద త్యాగం చేసి సూన్యంలోకి చూస్తూ పెద్ద పోటులా ఫీల్ అవుతున్నారా? చివరకు మీకా సూన్యమే మిగులుతుంది. తస్మాత్ జాగ్రత్త! మీ

గురించి మీరే పట్టించుకోవాలి, అందరినీ ఎంతో ప్రేమించే మీరు, మిమ్మల్నే మర్చిపోతే ఎలా?

నా బొంద, నాకు కొత్త బట్టలేందుకు? నాకు కొత్త బైకు ఎందుకు, నాకేమీ అవసరం లేదు, నాకేమీ వద్దులే, ఇప్పుడెందుకు? తరువాత చూసుకుందాం లే!

ఈ మాటలనే వాళ్ళని చెట్టుకు కట్టేసి కొట్టాలి! బుద్దిలేని గాడిదలు!!! ఏమన్నా అంటే, అవతలి వారి ఆనందంలోనే మా ఆనందం ఉందని పిల్ల పితిరి

సెంటిమెంట్ డైలాగులు. గూబ పడలకొట్టేవాడు లేక.

నా పిచ్చి గానీ ఎన్ని తిట్లు తిట్టినా మీకు సిగ్గు రాదు. ఎదో నా రాక్షస ప్రయత్నం.

మీరు పూర్తిగా మారటం జరగదని నాకు తెలుసు, కనీసం రేపు ఒక్క రోజు అయినా మీ స్వార్థం మీరు చూసుకోండి. మీకు నచ్చిన వస్తువు ఒకటైనా

కొనుక్కోండి, రేవు ఒక్క రోజైన పని ఎగ్గొట్టి బద్ధకంగా నిద్ర పోండి. అందరి గురించి ఆలోచించడం ఆపండి. మీ గురించి మాత్రమే ఆలోచించుకోండి, మీ

కోసం ఏదైనా వండుకోండి, కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్ర పోండి.

ఏంటి? ఇంకా convince అవ్వలేదా? తూ! దీనెమ్మ జీవితం! మీరు మారరె… మీకు నచ్చేటట్టే చెప్తాను ఆగండి. మీరు బాగుంటేనే మీ చుట్టూ ఉన్న వాళ్ళు

కూడా బాగుంటారు. ఈ ఒక్క రోజు స్వార్థం ఒక recharge లాంటిది. అప్పుడప్పుడూ ఇలా స్వార్థంగా ఉంటే, ఆ స్వార్థం ఇచ్చే ఆనందం వల్ల మీ బలం

రెట్టింపు అవుతుంది. అప్పుడు ఇంకా బోలెడన్ని త్యాగాలు చేసుకుని తగలడచ్చు.